శామ్ సంగ్ జే2 2018 స్మార్ట్ ఫోన్ విడుదల... పలు ఆకర్షణీయ ఫీచర్లు

27-04-2018 Fri 13:34
advertisement

దక్షిణకొరియాకు చెందిన శాంసంగ్ దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ జే2 2018 పేరుతో నూతన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. గెలాక్సీ జే2 2017కు ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. మూవ్ టు మెమొరీ కార్డు ఫీచర్ ద్వారా సోషల్ మీడియా యాప్ లో కంటెంట్ ను ఎక్స్ టర్నల్ మెమొరీ కార్డులోకి పంపించేస్తుంది. దీని ద్వారా ఫోన్ పనితీరు ఎప్పటికప్పుడు మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. ఇందులో శామ్ సంగ్ మాల్ యాప్ కూడా ఉంటుంది. ఫొటో ద్వారా ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఓ వస్తువు ఫొటో మాత్రమే ఉందనుకోండి. దాన్ని అప్ లోడ్ చేస్తే చాలు అన్ని వివరాలు వచ్చేస్తాయి.

ఈ ఫోన్లో 5 అంగుళాల క్యూహెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, 1.4 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 128 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీకి మైక్రో ఎస్ డీ స్లాట్, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక 8, ముందు 5 మెగా పిక్సల్ కెమెరాలు, రెండు వైపులా ఫ్లాష్ సదుపాయాలున్నాయి. దీని ధర 8,190.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement