నాగశౌర్య మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోంది
18-04-2018 Wed 15:22
- నాగశౌర్య హీరోగా 'అమ్మమ్మ గారిల్లు'
- హీరోయిన్ గా షాలిని
- భారీ రేటుకు శాటిలైట్ హక్కులు

నాగశౌర్య కథానాయకుడిగా సుందర్ దర్శకత్వంలో 'అమ్మమ్మ గారిల్లు' చిత్రం రూపొందింది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, టీజర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
గతంలో 'ఓయ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన షామిలి, ఈ సినిమాలో కథానాయికగా నటించింది. టైటిల్ ని బట్టే కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. విడుదలకి ముందే ఈ సినిమా శాటిలైట్ హక్కులు 2.75 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇక ఆడియో హక్కుల కోసం ఆదిత్య మ్యూజిక్ వారు భారీ మొత్తం చెల్లించడం విశేషం.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
9 hours ago

ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
10 hours ago

Advertisement 4