డబుల్ ట్రాప్ లో గురి తప్పని శ్రేయాసి... గోల్డ్ కొట్టేసింది!
11-04-2018 Wed 11:03
- కామన్ వెల్త్ గేమ్స్ లో మరో స్వర్ణం
- భారత ఖాతాలో 12 బంగారు పతకాలు
- తొలి స్థానంలో ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో మరో స్వర్ణపతకాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. నేడు జరిగిన డబుల్ ట్రాప్ షూటింగ్ విభాగంలో శ్రేయాసి సింగ్ అద్భుతరీతిలో రాణించి తొలి స్థానంలో నిలిచింది. శ్రేయాసి సాధించిన స్వర్ణంతో భారత ఖాతాలో 12 బంగారు పతకాలు చేరగా, మొత్తం 23 పతకాలు సాధించిన ఇండియా మెడల్స్ పట్టికలో ఆస్ట్రేలియా, బ్రిటన్ తరువాత మూడో స్థానంలో కొనసాగుతోంది. 12 గోల్డ్ మెడల్స్ తో పాటు 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ ను భారత ఆటగాళ్లు సాధించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 52 స్వర్ణాలు, 39 రజతాలు, 42 కాంస్యాలతో మొత్తం 133 పతకాలు సాధించి తొలి స్థానంలో ఉండగా, 24 స్వర్ణాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది.
More Latest News
ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
17 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
22 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
33 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
2 hours ago
