మరో కొత్త ఆఫర్ ని తీసుకొచ్చిన జియో!
Advertisement
ఈ నెల 7వ తేదీ నుండి ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో రూ.251 పేరిట కొత్త ఆఫర్ ని ప్రకటించింది. 102 జీబీ డేటా లభిస్తున్న ఈ ఆఫర్ లో ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను మై జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.

ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్న జియో 'ధన్ ధనా ధన్ లైవ్' షో లో హోస్ట్‌గా కమెడియన్ సునీల్ గ్రోవర్ తో పాటు శిల్పా షిండే, ఆలీ అస్గర్, సుగంధ మిశ్రా, కపిల్ దేవ్, సెహ్వాగ్ లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు. ఈ షోలను కేవలం జియో కస్టమర్లు మాత్రమే కాకుండా నాన్ జియో కస్టమర్లు కూడా 'మై జియో యాప్' ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు.
Thu, Apr 05, 2018, 11:49 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View