షియోమీ నుంచి త్వరలోనే రంగులు మార్చే స్మార్ట్‌ఫోన్‌..!
Advertisement
రోజురోజుకీ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చైనా మొబైల్‌ సంస్థ షియోమీ తాము తీసుకురానున్న ఫీచర్ గురించి ఓ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. త్వరలో తాము విడుదల చేయనున్న కొత్త మోడల్‌ ఫోన్‌కు రంగు మార్చుకోగలిగే సామర్థ్యం ఉంటుందని ఆ కంపెనీ ట్విట్టర్‌లో తెలిపింది. వినియోగదారులు ఏ రంగు కావాలనుకుంటే ఆ రంగులోకి ఫోన్‌ మారిపోతుందని పేర్కొంది. కొంతమంది నెటిజన్లు ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్నారా? అని ప్రశ్నించగా షియోమీ కంపెనీ ఆ ప్రశ్నకు స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపింది. ఈ ఫోన్‌ గురించి నెటిజన్లు పెద్ద చర్చే జరుపుతున్నారు.
Sat, Mar 31, 2018, 08:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View