రోబో సోఫియాతో డేటింగ్ కు వెళ్లిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్
Advertisement
హాంకాంగ్‌కు చెందిన హాన్‌ సన్‌ రోబోటిక్స్‌ సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్ రోబో సోఫియాతో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ డేటింగ్ కు వెళ్లాడు. అయితే, సోఫియాను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఈ డేటింగ్ కు సంబంధించిన 4.30 నిమిషాల నిడివిగల వీడియో ఒకటి షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మనుషుల హావభావాలను తెలుసుకుని మసలుకునేలా అభివృద్ధి చేసిన సోఫియా, విల్ స్మిత్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది...

ఈ సందర్భంగా సోఫియాకి వైన్ ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించింది. అలాగే జోక్ చెబుతానంటే, తనకు హాస్యం నచ్చదని చెప్పింది. తనకు ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ అంటే ఇష్టమనీ, హిప్‌-హాప్‌ మ్యూజిక్‌ కూడా వింటుంటానని చెప్పింది. చివర్లో స్మిత్ కి సోఫియా చిన్న ఝలక్ కూడా ఇచ్చింది. 'నిన్ను ముద్దు పెట్టుకుంటా'నని స్మిత్ చెప్పగా, అందుకు 'నో' చెబుతూ, తనని కేవలం స్నేహితుడిగానే భావిస్తున్నానని చెప్పింది. వారి సంభాషణ మీరూ వినచ్చు.  
 .   
Sat, Mar 31, 2018, 02:41 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View