ఆస్ట్రేలియా క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న డారెన్ లెహ్‌మన్‌
Advertisement
బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును అపఖ్యాతి పాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ పదవి నుంచి డారెన్ లెహ్‌మన్ తప్పుకోనున్నారు. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ముగిశాక కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు డారెన్ లెహ్‌మన్ స్వయంగా ప్రకటించారు. 2013లో ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాకి ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా జట్టుకి కొత్త కోచ్ అవసరం ఉందని, కోచ్ పదవికి రాజీనామా చేయడం జీవితంలోనే కష్టమైన పనని, అయినప్పటికీ చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు.
Thu, Mar 29, 2018, 07:00 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View