వాతావరణానికి ముప్పు... స్పేస్ ఎక్స్ రాకెట్ తో ఐనోస్పియర్ కు 60 కిలోమీటర్ల వెడల్పు రంద్రం!
Advertisement
గత సంవత్సరం ఆగస్టు 24న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం భూమిని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే కీలకమైన ఐనోస్పియర్ కు భారీ నష్టాన్ని కలిగించింది. ఓ శాటిలైట్ ను కక్ష్యలోకి చేర్చేందుకు పంపగా, ఇది ఐనోస్పియర్ పొరకు 60 కిలోమీటర్ల వెడల్పైన రంద్రాన్ని చేసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అయితే, ఇది తాత్కాలికమైనదేనని, దీని ద్వారా ప్రస్తుతానికి ఆ పరిధిలోకి వచ్చి పోతుండే ప్రాంతాల్లోని వారికి కొంత ప్రమాదమేనని తైవాన్ లోని నేషనల్ చెంగ్ కుంగ్ యూనివర్శిటీ అధ్యయనం వెల్లడించింది. కాగా, భూమి వాతావరణంలోని పై పొర అయిన ఐనోస్పియర్ ఫ్రీ ఎలక్ట్రాన్ లు, అయాన్ లతో నిండి వుండి, సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకర కిరణాలను అడ్డుకుంటుందన్న సంగతి తెలిసిందే.

ఇలా రాకెట్ ను ప్రయోగించడం ద్వారా ఇంత పెద్ద హోల్ ఎన్నడూ పడలేదని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. స్పేస్ ఎక్స్ గతంలో ఎన్నడూ ప్రయోగించనంత పెద్ద రాకెట్ కాబట్టే నష్టం కూడా భారీగా ఉందని అన్నారు. రాకెట్ వదిలిన పొగల కారణంగా ఏర్పడిన రసాయన చర్యల మూలంగానే ఐనోస్పియర్ కు రంద్రం ఏర్పడిందని తెలిపారు. ఈ అధ్యయనాన్ని 'స్పేస్ వెదర్' జర్నల్ ప్రత్యేకంగా ప్రచురించింది.
Tue, Mar 27, 2018, 10:30 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View