'ఛలో' తెచ్చిన ఉత్సాహంతో 'నర్తనశాల'
23-03-2018 Fri 10:23
- నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
- దర్శకుడిగా శ్రీనివాస చక్రవర్తి పరిచయం
- వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్

నాగశౌర్య సొంత బ్యానర్ పై తెరకెక్కిన 'ఛలో' భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తెచ్చిన లాభాలతో .. ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకి 'నర్తనశాల' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు.
శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఛలో' సినిమాకి సంగీతాన్ని అందించి మంచి మార్కులు కొట్టేసిన సాగర్ ను .. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సొంత సినిమాతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు నాగశౌర్య చేతిలో ఉండటం విశేషం.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
9 hours ago

ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
10 hours ago

Advertisement 4