స్మార్ట్ ఫోన్ కు తగిలిస్తే పనిచేసే మినీ ఫ్యాన్ వచ్చేసింది... ధర రూ. 66 నుంచి మొదలు!
Advertisement
మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చి వైరల్ అవుతోంది. సెల్ ఫోన్ లో గంటల తరబడి మాట్లాడేటప్పుడు ముఖానికి చెమటలు పడతాయన్న భయం లేకుండా చేసే మినీ ఫ్యాన్ ఒకటి ఇప్పుడు మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. అతి తక్కువ ధరకే ఇది అందుబాటులో ఉంది. రెండు రెక్కలతో వివిధ రంగుల్లో వచ్చిన ఈ ఫ్యాన్లను రూ. 66 నుంచి రూ. 249 ధర మధ్య కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ చార్జింగ్ కు ఉపయోగించే పోర్టుకు దీన్ని ఎటాచ్ చేసుకుంటే, బ్యాటరీ చార్జింగ్ తోనే ఇది పని చేస్తుంది. అమెజాన్ లో రూ. 168కి, ఈ బేలో రూ. 249కి, మినీ ఇన్ ది బాక్స్ వెబ్ సైట్ నుంచి రూ. 66కి దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఉచిత హోం డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాలూ ఉన్నాయి. ఇప్పుడీ స్మార్ట్ ఫోన్ మినీ ఫ్యాన్ నెటిజన్ల చేతుల్లోకి శరవేగంగా చేరుతోంది.
Mon, Mar 12, 2018, 11:50 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View