పెరియార్ విగ్రహాలను ఎలా కాపాడుకోవాలో తమిళులకు తెలుసు: కమలహాసన్
Advertisement
ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు కమలహాసన్ స్పందించారు. ‘‘పెరియార్ విగ్రహాలను పరిరక్షించేందుకు పోలీసులను నియమించాల్సిన అవసరం లేదు. వాటిని మేం కాపాడుకోగలం. కావేరీ నిర్వహణ బోర్డు ఏర్పాటు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఈ పని చేస్తున్నారని నేను భావిస్తున్నా’’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో పెరియార్ రామస్వామి విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కొందరు గత రాత్రి కూల్చివేసిన విషయం తెలిసిందే. అలాగే, త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడంతో ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించి, విగ్రహాల వద్ద బందోబస్తుకు ఆదేశించారు.
Wed, Mar 07, 2018, 01:21 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View