కోపానికి, గుండెపోటుకి సంబంధం వుందట.. అధ్యయనం వెల్లడి!
Advertisement
మీకు ఊరికే కోపం వచ్చేస్తుంటుందా? తరచుగా కోపంతో ఊగిపోతుంటారా? అయితే మీరు తప్పకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని యూరోపియన్ హార్ట్ జర్నల్ సూచిస్తోంది. ఎప్పుడో ఒకసారి కోపగించుకునే వారి కంటే తరచుగా కోపంతో ఊగిపోయే వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సింది వస్తుందని యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది.

వ్యక్తి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రెండు గంటల్లోపు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఆగ్రహం తెచ్చుకుని దానిని పెద్దపెద్ద అరుపులతో వ్యక్తపరిచేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఇలా ఆగ్రహం వ్యక్తం చేసేవారికి ఇదివరకు గుండె సమస్యలు ఉన్నా, లేక గుండె సమస్యలు వచ్చే ఆస్కారం ఉన్న వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వారు వెల్లడించారు. కోపగించుకున్న ప్రతి సందర్భంలోనూ గుండెపోటు రానప్పటికీ, తీవ్ర ఆగ్రహం కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం మాత్రం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
Tue, Feb 20, 2018, 08:36 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View