మోదీ వ్యాఖ్యలపై మరోసారి విరుచుకుపడ్డ రేణుకా చౌదరి
12-02-2018 Mon 10:35
- నవ్వడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు
- ఐదు దఫాలుగా రాజ్యసభలో ఉంటున్న నన్ను నెగెటివ్ పాత్రతో పోల్చారు
- మహిళలపై మోదీకి ఎలాంటి గౌరవం ఉందో ఇది తెలియజేస్తోంది

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వు పట్ల ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై రేణుకతో పాటు పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా, రేణుక మరోసారి విరుచుకుపడ్డారు. ఎలా నవ్వాలి, ఎప్పుడు నవ్వాలి? అనే విషయం తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
అసలు నవ్వేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. నవ్వుపై జీఎస్టీ కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. ఐదు దఫాలుగా తాను రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నానని... అలాంటి తనను మోదీ ఒక నెగెటివ్ పాత్రతో పోల్చడం అత్యంత దారుణమని మండిపడ్డారు. మహిళల పట్ల మోదీకి ఉన్న దృక్పథాన్ని ఆయన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు.
More Latest News
పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
15 minutes ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
33 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
39 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
2 hours ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
2 hours ago
