రేణుకా చౌదరిని ఉద్దేశించి ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. విమర్శలు
09-02-2018 Fri 11:14
- శూర్పణఖ ఫొటోను పెట్టిన కిరణ్ రిజిజు
- మోదీ వ్యాఖ్యలు, మిగిలిన సభ్యులు పగలబడి నవ్వడాన్ని జత చేసిన మంత్రి
- వెల్లువెత్తిన విమర్శలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి బిగ్గరగా నవ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య అసంతృప్తిని వ్యక్తం చేయగా... ప్రధాని మోదీ స్పందిస్తూ, ఎప్పుడో రామాయణం సీరియల్ లో ఇలాంటి నవ్వు విన్నామని, ఇప్పుడు మరో సారి విన్నామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కలకలం రేగింది. మరోవైపు రామాయణం సీరియల్ లో ఇంతెలా ఎవరు నవ్వారనే చర్చ కూడా దేశ వ్యాప్తంగా నడిచింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. శూర్పణఖ ఫొటోను దానికి జతచేశారు. దీంతో పాటు రేణుకను ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలను, దానికి మిగిలిన సభ్యులు పగలబడి నవ్వినా దృశ్యాన్ని ఆయన జత చేశారు. ఈ పోస్ట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, తన పోస్ట్ ను రిజిజు తొలగించారు.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
4 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
5 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
5 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
6 hours ago
