సామాన్యుడితో జపాన్ రాకుమారి వివాహం 2020లో..!
Advertisement
ఒక సామాన్యుడితో గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం జరిగిన జపాన్ రాకుమారి మకో పెళ్లి వాయిదా పడింది. ఏర్పాట్లలో జాప్యం కారణంగా వివాహాన్ని 2020 నాటికి వాయిదా వేస్తున్నట్లు జపాన్ రాజభవనం తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటనతో జపాన్ వాసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెద్దలు కూడా అంగీకరించిన వారిద్దరి పెళ్లి ఈ ఏడాది నవంబరులో జరగాల్సి ఉంది.

అయితే ఏర్పాట్లలో ఆలస్యం కారణంగా వివాహాన్ని రెండేళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ప్రకటించింది. మకో కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మరోవైపు మకో నిశ్చితార్థాన్ని ఈ ఏడాది మార్చిలో మరోసారి అధికారికంగా నిర్వహించాలని కూడా అనుకున్నారు. కానీ, అది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అసలు ఈ పెళ్లి వాయిదాకి కొన్ని ఊహాగానాలు కూడా విన్పిస్తున్నాయి. మకో ప్రియుడు కొమురో తల్లి, ఆమె మాజీ భర్తకు మధ్య ఆర్థిక తగాదాలు జరిగినట్లు ఇటీవల జపాన్ మీడియాలో వార్తలొచ్చాయి. పెళ్లి వాయిదాకి ఈ పరిణామమే కారణమని పలువురు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ వివాహ వాయిదాకి, దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ ఇంపీరియల్ హౌస్ హోల్డ్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

కాగా, జపాన్ రాచరిక నిబంధనల ప్రకారం, సామాన్యులను పెళ్లాడిన రాకుమారిలకు రాజరిక హోదా పోతుంది. అయితే తాను కొమురోనే పెళ్లి చేసుకుంటానని మకో పట్టుబట్టడంతో వారిద్దరి పెళ్లికి అంగీకరించారు.
Wed, Feb 07, 2018, 06:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View