వైన్ తాగితే డిప్రెషన్ తగ్గుతుందట.. పరిశోధనలో వెల్లడి!
Advertisement
వైన్ తీసుకుంటే డిప్రెషన్ తగ్గుతుందా? అంటే పరిమిత మోతాదులో వైన్‌ తీసుకుంటే కుంగుబాటు దూరమవుతుందని న్యూయార్క్‌లోని మౌంట్‌ సినాయ్‌ హాస్పిటల్‌ రీసెర్చర్లు చెబుతున్నారు. డిప్రెషన్ కు అందిస్తున్న చికిత్సలు కేవలం 50 శాతం కేసుల్లో తాత్కాలిక ఉపశమనం కల్గిస్తున్నాయన్న నేపథ్యంలో మౌంట్ సినాయ్ ఆసుపత్రి వైద్యులు పరిశోధనలు చేపట్టారు.

ద్రాక్షలో ఉండే పదార్ధాలు కుంగుబాటుకు గురైన ఎలుకల్లో ప్రశాంతతను చేకూర్చినట్టు గుర్తించారు. దీంతో వైన్‌ లో వాడే ద్రాక్ష రసంలో ఉండే కొన్ని పదార్థాలు కణాల వాపును తగ్గించడంతో పాటు మెదడులో ట్రాన్స్‌ మిషన్‌ సిగ్నల్స్‌ ను మెరుగుపరుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. డిప్రెషన్ చికిత్సలో మెరుగైన థెరపీలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను నేచర్‌ కమ్యూనికేషన్స్ జర్నల్‌ లో ప్రచురించారు. 
Wed, Feb 07, 2018, 10:40 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View