పెళ్లి కూతురిని ఇంటర్వ్యూ చేసిన 'జర్నలిస్ట్' పెళ్లికొడుకు.. మీరూ చూడండి!
Advertisement
చేస్తోన్న ఉద్యోగం పట్ల నిబద్ధత, అంకిత భావం అంటే ఇదేనేమో.. ఓ జర్నలిస్ట్ తన పెళ్లి రోజున కూడా సెలవు పెట్టలేదు.. మరికొన్ని నిమిషాల్లో ఒకరికి భర్తను కాబోతున్న సమయంలోనూ బ్రేకింగ్ న్యూస్ అంటూ రిపోర్టర్‌గా పనిచేశాడు. అది కూడ తన పెళ్లి పందిరి నుంచే.. అవును, పెళ్లి పందిరి నుంచే పెళ్లికూతురు, తన అత్తయ్యల ఇంటర్వ్యూ తీసుకుంటూ లైవ్ ప్రసారం చేశాడు. అతడు పాకిస్థాన్‌లో సీ 41 న్యూస్‌ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.

తన పెళ్లి గురించి తానే రిపోర్ట్ చేసి, పెళ్లి కూతురి ఇంటర్వ్యూ తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. తాను ఇప్పుడు తన పెళ్లి పందిరిలో ఉన్నానని, తన పెళ్లి గురించి బ్రేకింగ్ న్యూస్ చెబుతున్నానని ఆయన చెబుతోన్న డైలాగులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని కూడా తెలిపాడు. తనకు కాబోయే భార్యతో మాట్లాడించాడు. తన తల్లిని ఇంటర్వ్యూ చేస్తూ.. మీ అబ్బాయి పెళ్లి అవుతోంది.. మీ అభిప్రాయం ఏంటీ? అని కూడా అడిగాడు. ఇటీవల సీ 41 ఛానెల్‌లో ఈ ఇంటర్వ్యూ ప్రసారం అయింది. సోషల్ మీడియాతో ఈ ఇంటర్వ్యూ చక్కర్లు కొడుతోంది. మీరూ చూడండి..  
Mon, Feb 05, 2018, 03:21 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View