సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. లాగి కొట్టిన కర్ణాటక మంత్రి శివకుమార్‌

05-02-2018 Mon 14:12
advertisement

తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు కనపడితే చాలు వారితో సెల్ఫీలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు. అయితే, ఒక్కోసారి అభిమానుల ప్రవర్తన చికాకు పుట్టిస్తుంది. ఇటువంటి అనుభవమే కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్‌కి ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి వెళుతుండగా ఓ అభిమాని ఆయ‌న‌తో సెల్ఫీ దిగ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు మంత్రి త‌న అభిమాని చేతిపై కొట్టాడు. దీంతో స్మార్ట్ ఫోన్ కింద‌ప‌డిపోయింది.

ఈ స‌మ‌యంలో ఇత‌రులు త‌మ స్మార్ట్ ఫోన్ ల‌లో ఈ దృశ్యాన్ని బంధించి సామాజిక మాధ్య‌మాల్లో పెట్టారు. దీంతో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. కాగా, డీకే శివ‌కుమార్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఇదే మొద‌టిసారి కాదు.. గ‌తంలో కూడా ఓ సారి ఆయ‌న ఇలాగే ప్ర‌వ‌ర్తించారు.   

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement