చంద్రగ్రహణం సమయంలో ఏలియన్స్ వచ్చారా?.. నాసా వీడియోలో కనిపించిన దృశ్యం... వీడియో చూడండి
Advertisement
జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా చూడగా, ఏలియన్ హంటర్లకు యూఎఫ్ఓ కనిపించడం ఆసక్తిరేపుతోంది. గ్రహణం సమయంలో చంద్రుడి పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఒక వస్తువుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాసా విడుదల చేసిన వీడియోలో కూడా ఈ వస్తువు కనిపించడంతో ఏలియన్ హంటర్లు అది యూఎఫ్ఓ అని, ఏలియన్స్ ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని వారు చెబుతున్నారు.

మనిషి తయారు చేసిన ఏ వాహకం కూడా అంతవేగంతో వెళ్లడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. యూఎఫ్‌ఓ మానియా అనే చానెల్ పోస్టు చేసిన ఈ వీడియోను కేవలం 24 గంటల్లోనే 40 వేల మందికిపైగా చూడడం విశేషం. సైంటిస్టులు మాత్రం అది బోయింగ్ ఎయిర్ క్రాప్ట్ లేదా వెదర్ బెలూన్ అని పేర్కొంటున్నారు.  
Sat, Feb 03, 2018, 08:55 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View