నాగశౌర్యకి మంచి మార్కులు పడిపోయాయి
02-02-2018 Fri 13:04
- ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు 'ఛలో'
- నాగశౌర్య నటనకు ప్రశంసలు
- దర్శకుడికి దక్కుతోన్న అభినందనలు

వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య .. రష్మిక మందన జంటగా నటించిన 'ఛలో' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లు నటన పరంగా నాగశౌర్య మంచి మార్కులు కొట్టేశాడని అంటున్నారు. నటన విషయంలో ఆయన గత చిత్రాల్లో కంటే మంచి పరిణతిని కనబరిచాడని చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులతో గొడవపడే 'హరి' పాత్రలో ఆయన చాలా బాగా చేశాడని అంటున్నారు.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సీన్స్ ను నాగశౌర్య చాలా బాగా చేశాడని చెబుతున్నారు. హీరోగానూ .. నిర్మాతగాను ఈసారి ఆయన పూర్తి వినోదాత్మక చిత్రాన్ని ఎంచుకోవడం విశేషమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దర్శకుడు వెంకీ కుడుముల .. పాత్రలను మలచిన తీరు, ప్రతి పాత్ర నుంచి కావాల్సినంత వినోదాన్ని రాబట్టిన తీరు బాగుందంటూ ఆయనను కూడా అభినందిస్తున్నారు.
More Telugu News
మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు: మమతా బెనర్జీ
17 minutes ago

యథార్థ సంఘటన ఆధారంగా రవితేజ కొత్త సినిమా!
38 minutes ago

ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మేజర్' టీజర్!
1 hour ago

మమతా బెనర్జీ క్లీన్ బౌల్డ్ అయ్యారు: మోదీ
2 hours ago

అలా అంటున్నారంటే.. ఏడుకొండలవాడిపై విశ్వాసం లేదని జగన్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే కదా?: అచ్చెన్నాయుడు
2 hours ago
