అనారోగ్యం దరిజేరనీయని కొత్తరకం బియ్యం... 'క్లైమేట్ స్మార్ట్ రైస్'!
Advertisement
అనారోగ్యం దరిజేరనీయని వరి వంగడాలను అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఏడు రకాల అటవీ వరి వంగడాల జన్యువుల ద్వారా కొత్త రకపు వరి విత్తనాలు అభివృద్ధి చేసినట్టు ఐఆర్‌ఆర్‌ఐ తెలిపింది. ఈ వంగడాల ద్వారా పండిన పంటను ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందని వారు తెలిపారు.

ఈ వరి వంగడాలను ‘క్లైమేట్‌ స్మార్ట్‌ రైస్‌’ గా పేర్కొనవచ్చని తెలిపింది. భూమిపై సంభవించే వాతావరణ మార్పులను తట్టుకుని అధిక ఉత్పత్తినిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వివిధ రకాల జీవ, నిర్జీవ సంబంధిత వ్యాధులను ఇవి సమర్థవంతంగా నిరోధిస్తాయని వారు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ’నేచుర్‌ జెనెటిక్స్‌’ అనే జర్నల్‌ లో ప్రచురితమయ్యాయి. 
Wed, Jan 31, 2018, 04:10 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View