దగ్గు సిరప్ తాగుతున్నారా?.. ఇకపై జాగ్రత్త!
Advertisement
దగ్గు సిరప్ ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత హాని చేస్తుందని చెబుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల పిల్లల్లో దగ్గు వస్తుందని, దానిని సహజ విధానంలో నయం చేయాలి తప్పితే, దగ్గు సిరప్ వాడాలంటూ వైద్యులు సిఫారుసు చేయడం మానుకోవాలని సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ సతీష్ డియో పుజారి చిన్న పిల్లల వైద్యులకు సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే దగ్గు మందును నిషేధించాయని పేర్కొన్నారు.

దగ్గు ద్రావణంలో ఉండే మత్తు వల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుందని డాక్టర్ సతీష్ తెలిపారు. పిల్లల శ్వాస ప్రక్రియపై విపరీత ప్రభావం చూపిస్తుందని వివరించారు. దగ్గు సిరప్‌ను పిల్లలు వాడడం అత్యంత ప్రమాదకరమని మరో వైద్యుడు డాక్టర్ ముజావార్ తెలిపారు.
Tue, Jan 30, 2018, 08:26 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View