రోజుకి ఒక్క సిగరేట్‌ తాగితే ఏమీ కాదని అనుకుంటున్నారా?.. జర భద్రం అంటోన్న పరిశోధకులు!
Advertisement
ధూమపానం ప్రమాదకరమని, దానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయినప్పటికీ రోజుకో సిగరెట్ తాగితే ఏమీ కాదని కొందరు అనుకుంటుంటారు. కానీ రోజుకి ఒక సిగరెట్‌ తాగినా గుండె జబ్బులు, స్ట్రోక్‌ రిస్క్‌ 50 శాతం పెరుగుతాయని లండన్‌కు చెందిన యూసీఎల్ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఇక మితిమీరి రోజుకు 20 సిగరెట్లు తాగే వారికి గుండెపోటు వచ్చే ముప్పు దానికి రెండింతలవుతాయని అంటే నూరు శాతం పెరుగుతుందని చెప్పారు.

ఈ పరిశోధనలో తాము 140 శాస్త్రీయ అధ్యయనాలను విశ్లేషించిన తరువాత ఈ విషయాలను చెబుతున్నామ‌ని అన్నారు. సిగ‌రెట్ అల‌వాటుని త‌గ్గించుకోవ‌డం కాద‌ని, పూర్తిగా మానేయాల్సిందేన‌ని సూచిస్తున్నారు. రోజుకి ఒక్క సిగ‌రెట్ తాగినా ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పు ఉంటుంద‌ని అన్నారు.
Fri, Jan 26, 2018, 04:34 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View