అంత‌రిక్షంలో వాక్యూమ్ క్లీన‌ర్ ప్ర‌యోగం... వీడియో చూడండి!
Advertisement
అంత‌రిక్షంలో వాక్యూమ్ క్లీన‌ర్ సాయంతో ఎగ‌ర‌డం సాధ్య‌మేనా? అంటే... అవును, ఎగ‌రొచ్చు.. అని చెప్పచ్చు. అందుకు ర‌ష్య‌న్ వ్యోమ‌గామి ఆంటోన్‌ ష్క‌ప్లేరోవ్ పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో వ్యోమ‌గాములు ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేస్తుంటారు. అప్పుడప్పుడు భూమ్మీద కొంత‌మంది అడిగే ప్ర‌శ్న‌ల‌కు కూడా వారు ఐఎస్ఎస్ నుంచి స‌మాధానం చెబుతుంటారు. అలాగే ర‌ష్య‌న్ వ్యోమ‌గామి ఆంటోన్ కూడా వాక్యూమ్ క్లీన‌ర్ మీద అంత‌రిక్షంలో ఎగ‌రొచ్చా? అని కొంత‌మంది అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఈ వీడియోను పోస్ట్ చేశారు.

వాక్యూమ్ క్లీన‌ర్ మీద కూర్చుని, సూప‌ర్ మ్యాన్ లాగ పోజు పెట్టి ఆంటోన్ ఎగురుతుండ‌టం వీడియోలో చూడొచ్చు. జ‌న‌వ‌రి 20న ఆంటోన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను ల‌క్ష మందికి పైగా వీక్షించారు. అలాగే 2,200కి పైగా రీట్వీట్లు చేశారు.
Tue, Jan 23, 2018, 02:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View