మద్యంతో జలకాలాడుతుంది... ఆమె మద్యం ఖర్చు ఏడాదికి 1.94 కోట్లు!
Advertisement
ఉక్రెయిన్ కు చెందిన సింగర్, మోడల్, నటి నతల్యా షమ్రెన్కోవాది విభిన్నమైన అభిరుచి. షాంపేన్ లో మునిగితేలడం ఆమెకు చాలా ఇష్టం. పాకిస్థాన్ మూలాలు కలిగిన బ్రిటీష్ కోటీశ్వరుడు మొహమ్మద్ జహూర్ ను 2003లో వివాహం చేసుకున్న అనంతరం ఆమె తన పేరును కమాలియాగా మార్చుకుంది.

షాంపేన్ అంటే పడిచచ్చే కమలియా లెక్కలేనన్ని ఖరీదైన మద్యం బాటిళ్లను ఖాళీ చేస్తుంటుంది. ఆమె ఏడాదికి వినియోగించే మద్యానికి 1.94 కోట్లు ఖర్చవుతాయంటే ఆమె ఏ స్ధాయిలో షాంపేన్ కొనుగోలు చేస్తుందో ఊహించుకోవచ్చు. ఆమె స్నానం కూడా షాంపేన్ తోనే చేస్తుందంటే వినడానికి కాస్త విడ్డూరంగానే వుంటుంది. అయినా ఇది వాస్తవమే. ఆమె స్నానానికి మద్యం సిద్ధం చేసేందుకు మొత్తం 22 మంది పనిచేయడం విశేషం. కేవలం అందం కోసమే ఆమె ఇలా మద్యంతో స్నానమాడుతుందట. ఈ ప్రత్యేకతే ఆమెకు ప్రత్యేక గుర్తింపుతీసుకొచ్చి, వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది. 
Tue, Jan 23, 2018, 09:59 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View