ఇక పురుషులు వాడే కుటుంబ నియంత్రణ మాత్రలు వచ్చేస్తున్నాయ్!
Advertisement
ఇప్పటి వరకు స్త్రీలకు మాత్రమే పరిమితమైన గర్భనిరోధక సాధనలు ఇప్పుడు పురుషుల కోసం కూడా వచ్చేస్తున్నాయి. పురుషుల కోసం కొత్తగా కుటుంబ నియంత్రణ మాత్రల తయారీకి మార్గం సుగమమైంది. ఆఫ్రికాలో కనిపించే అకోకాంతెర షింపేరి, స్రొఫాంతస్ గ్రాటన్ అనే రెండు మొక్కల్లో లభ్యమయ్యే ‘వొవాబైన్’ అనే విషపదార్థం ద్వారా పురుషుల కోసం కుటుంబ నియంత్రణ ట్యాబ్లెట్లు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మొక్కల్లోని విషాన్ని అతి కొద్ది మోతాదులో ఉపయోగించడం ద్వారా ఈ మాత్రలను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన మొక్కల్లోని రసాన్ని ఆఫ్రికా అడవుల్లో వేటకెళ్లే వారు తమ బాణాలకు పూసి జంతువులను వేటాడుతుంటారు. జంతువు శరీరానికి బాణం తగిలిన మరుక్షణం అందులోని విషం పనిచేసి ప్రాణాలు తీస్తుంది. అయితే ఈ విష పదార్థాన్ని చాలా అత్యల్ప స్థాయిలో వాడడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురుషుల్లోని శుక్ర కణాలను ఇది అచేతన పరుస్తుందని గుర్తించారు.

ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇకపై పురుషుల కోసం మాత్రల రూపంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. విషపూరితమైన వొవాబైన్‌కు కొన్ని మాంసకృత్తులు జోడించడం ద్వారా ఎలుకల్లో చేసిన ప్రయోగం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలోని వీర్య కణాలు బలహీన పడి స్త్రీ అండాశయం వైపు పరుగులు తీయలేకపోయాయని వివరించారు.
Sun, Jan 21, 2018, 09:14 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View