యాక్షన్ కామెడీ నేపథ్యంతో ఆకట్టుకుంటోన్న 'ఛలో' ట్రైలర్
18-01-2018 Thu 12:09
- నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో'
- కథానాయికగా రష్మిక మందన పరిచయం
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

నాగశౌర్య కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'ఛలో' సినిమా తెరకెక్కింది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా, ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి తమిళనాడులోని 'తిరుప్పురం'లో హీరో అడుగుపెట్టడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది.
అక్కడ తెలుగు .. తమిళుల మధ్య చోటుచేసుకునే పరిణామాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ కామెడీ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంది. హీరో హీరోయిన్స్ ను క్లాస్ మేట్స్ గా చూపిస్తూ కట్ చేసిన సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా వున్నాయి. చూస్తుంటే నాగశౌర్య తన సొంత సినిమాతో హిట్ కొట్టేలానే వున్నాడు.
More Telugu News
నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!
3 minutes ago

ఎంబీఏ చదువుతున్నప్పటి ఫొటో పంచుకున్న హీరో సిద్ధార్థ్
40 minutes ago

'బాహుబలి' నిర్మాతల నుంచి రెజీనాకు కాల్!
44 minutes ago

ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మేజర్' టీజర్!
2 hours ago
