వాకింగ్ చేస్తే బీమా ప్రీమియంలో మీకు ప్రత్యేక డిస్కౌంట్!... వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టే ప్రీమియం
Advertisement
Advertisement
మీరు ఫిట్ నెస్ ప్రియులా? రోజు శారీరక ఆరోగ్యంపై శ్రద్ద చూపిస్తుంటారా...? అయితే మీకు కచ్చితంగా బీమా ప్రీమియంలో డిస్కౌంట్ వచ్చేస్తుంది. కానీ, ఇప్పుడు కాదు, ఈ ప్రతిపాదనకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఆమోద ముద్ర వేసిన తర్వాతే. చేతికి ఫిట్ నెస్ బ్యాండ్ వేసుకుని వాకింగ్ చేయడం ద్వారా అందులో రికార్డయ్యే సమాచారమే బీమా ప్రీమియం తగ్గింపునకు ఆధారం కానుంది.

ఈ విధంగా ఒంటికి ధరించే ఫిట్ నెస్ పరికరాలను, పోర్టబుల్ డివైజెస్ ను బీమా రంగంలో ప్రవేశపెట్టే విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఐఆర్డీఏ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందుకే పాలసీలో ప్రీమియం తగ్గింపు ప్రతిపాదన వచ్చింది. ‘‘ప్రస్తుతం పాలసీదారులు అందరినీ వారి శారీరక ఫిట్ నెస్ తో సంబంధం లేకుండా ఒకే గాటన కడుతున్నాం. ఇలా కాకుండా విడిగా ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా బీమా ప్రీమియంలో మార్పులు చేయాలని సూచించాం’’ అని ఓ బీమా కంపెనీ సీఈవో వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈ కమిటీ తన సిఫారసులను ఐఆర్డీఏ ముందుంచుతుంది.
Sat, Jan 06, 2018, 07:04 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View