నీతా, ముకేశ్ అంబానీల బంధం కుదిరిందలా!
Advertisement
ఇటీవ‌ల రిల‌య‌న్స్ వారి 40 ఏళ్ల ఉత్స‌వం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ వేడుక‌లో వారి కుటుంబాల‌కు సంబంధించిన కొన్ని విష‌యాల‌ను అంబానీ కుటుంబీకులు వెల్ల‌డించారు. అందులో భాగంగా ముకేశ్ అంబానీ, ఆయ‌న భార్య నీతా అంబానీ గురించి ఓ విష‌యం చెప్పారు. నీతా టీచ‌ర్‌గా ప‌నిచేసింద‌ని, త‌న‌కు కూడా టీచ‌ర్‌గా ప‌నిచేయాల‌ని ఉంద‌ని ముకేశ్ అన్నారు. అంతేకాకుండా ఒక‌వేళ తాను రిల‌య‌న్స్ వ్యాపారంలోకి అడుగుపెట్ట‌క‌పోయి ఉంటే ప్ర‌పంచ బ్యాంకులో ప‌నిచేసేవాడిన‌ని అన్నారు. ఇంత‌కీ నీతా, ముకేశ్‌ల మ‌ధ్య బంధం ఎలా కుదిరిందో తెలుసా?

నీతా త‌న ఐదేళ్ల వ‌య‌సులోనే భ‌ర‌త‌నాట్యం నేర్చుకున్నారు. నార్సి మోంజీ కామ‌ర్స్ అండ్ ఎక‌నామిక్స్ కాలేజీ నుంచి డిగ్రీ ప‌ట్టా పుచ్చుకున్నారు. త‌ర్వాత ఓ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా చేరారు. మ‌రోప‌క్క దేశ‌వ్యాప్తంగా భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చేవారు. అలాంటి ఓ ప్ర‌ద‌ర్శ‌న‌లో ముకేశ్ తండ్రి ధీరూభాయ్ అంబానీ ఆమెను చూశాడు. త‌న కొడుక్కి స‌రైన జోడీ అని నిశ్చ‌యించుకుని నీతా త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాడు. ముకేశ్ కు కూడా నీతా న‌చ్చింది. కానీ పెళ్లి చేసుకోవాలంటే నీతా ఓ ష‌ర‌తు పెట్టింది. తాను పెళ్ల‌య్యాక కూడా టీచ‌ర్ వృత్తిని కొన‌సాగిస్తాన‌ని చెప్పింది. అందుకు ముకేశ్ అంగీక‌రించ‌డంతో వారిద్దరూ ఒక్క‌టయ్యారు. త‌ర్వాత కొన్ని నెల‌లు ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేసి, త‌ర్వాత రిల‌యన్స్ వ్యాపారంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.
Mon, Jan 01, 2018, 10:45 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View