తొలి సినిమా ఫ్లాప్‌ అయిందని తెలిసి అప్పట్లో చాలా బాధపడ్డా: అక్కినేని అఖిల్‌
Advertisement
అక్కినేని అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ తెర‌కెక్కించిన‌ చిత్రం 'హ‌లో' ఇటీవ‌లే విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అఖిల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపాడు. తాను న‌టించిన తొలి సినిమా 'అఖిల్‌' ఫ్లాప్‌ అయిందని తెలిసి అప్పట్లో చాలా బాధపడ్డాన‌ని అన్నాడు. ఆ సినిమా ప్లాప్ కావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుందామ‌ని ఆ సినిమాను చాలా సార్లు చూశానని అన్నాడు.

‘అఖిల్‌’ సినిమాను త‌న తండ్రి నాగార్జున ఫైనలైజ్‌ చేయలేదని, కథ విని తానే సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నానని అఖిల్ తెలిపాడు. ఆ త‌రువాత విరామం ఇచ్చి మంచి సినిమా చేయాలనుకున్నాన‌ని తెలిపాడు. అలాగే, కథతో వ్యక్తిగతంగా కనెక్ట్‌ అవ్వాలనుకున్నాన‌ని అన్నాడు. తాను అనుకున్న‌టువంటి కథే విక్రమ్‌ కె.కుమార్‌ వినిపించారని తెలిపాడు. విక్రమ్‌లాంటి దర్శకుడితో పని చేసినందుకు గర్వపడుతున్నాన‌ని ‘హలో’ సినిమా త‌న‌ జీవితాన్ని మార్చేసిందని తెలిపాడు.
Wed, Dec 27, 2017, 08:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View