ప్రతిరోజూ కోడి గుడ్డు తింటే చాలా మంచిద‌ని.. మ‌రోసారి తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు
Advertisement
ప్రతిరోజూ కోడి గుడ్డు తింటే చాలా మంచిద‌ని, శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు పుష్క‌లంగా అందుతాయ‌ని వైద్యులు చెబుతుంటారు. ఎన్నో ప‌రిశోధ‌న‌లు కూడా ఈ విష‌యాన్ని రుజువు చేశాయి. కోడి గుడ్డు వ‌ల్ల చిన్నారుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి వాషింగ్టన్‌ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు అధ్యయనం జ‌రిపి ప‌లు విష‌యాల‌ను తెలిపారు.

రోజుకి ఒక కోడి గుడ్డు తింటే పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుందని తేల్చి చెప్పారు. ఆరు నెలల పాటు ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు చొప్పున తినే పిల్లల మెదడు పనితీరును తాము ప‌రిశీలించి ఈ విష‌యాన్ని చెబుతున్నామ‌ని తెలిపారు. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, డీహెచ్‌ఏ వంటివి మెదడు ప‌నితీరును మెరుగుప‌ర్చ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు.

Wed, Dec 27, 2017, 02:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View