చెమ‌ట‌లు క‌క్కే రోబోలు... జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌ల ఆవిష్కరణ!
Advertisement
మ‌నుషుల్లాగే క‌ష్ట‌మైన వ్యాయామాలు చేసిన త‌ర్వాత చెమ‌ట‌లు చిందించే రోబోల‌ను జ‌పాన్‌లోని టోక్యో విశ్వ‌విద్యాల‌య శాస్త్ర‌వేత్త‌లు త‌యారుచేశారు. కెన్‌షిరో, కెన్‌గోరో అనే పేర్లు గ‌ల రెండు రోబోలు వ్యాయామం చేసి అచ్చం మ‌నుషుల్లాగే చెమ‌టలు కక్కుతున్నాయి. అంతేకాకుండా పుషప్స్, సిటప్స్, క్రంచెస్, స్ట్రెచెస్‌ వంటి వివిధ ర‌కాల‌ వ్యాయామాలన్నీ చేసేస్తూ చెమటలు చిందిస్తూ వుంటాయి.

ఇంతకీ, ఈ రోబోలకు చెమటలు ఎలా పడుతున్నాయంటే, వీటి దేహంపై ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటి ఆవిరిని పంపించి, చెమట పట్టిన భావ‌న‌ను క‌లిగేలా చేశారు. మ‌నుషుల శ‌రీర స్వ‌భావాన్ని పూర్తిగా అధ్య‌య‌నం చేయ‌డానికి ఈ చెమ‌ట ప‌ట్టే రోబోల‌ను ఉప‌యోగించవ‌చ్చు. అలాగే త్వ‌ర‌లో స్ప‌ర్శ‌జ్ఞానం, స్వ‌యం చాల‌క‌శ‌క్తి వంటి చ‌ర్య‌ల‌ను కూడా మెషీన్ లెర్నింగ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు ఈ శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.
Tue, Dec 26, 2017, 12:15 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View