ఆహారంలో వీటిని చేర్చండి .. గుండెను పదిలపర్చుకోండి!
Advertisement
మనం తీసుకునే ఆహారంలో సోయా, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటిని తీసుకోవడం ద్వారా అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించుకోవచ్చని ఆ అధ్యయనం సూచిస్తోంది.

ప్రతిరోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకోవడం ద్వారా శరీరంలోని హానికర ఎల్డీఎల్ కొవ్వులను ఐదు శాతం మేరకు తగ్గించుకోవచ్చట. ఈ విధంగా చేయడం ద్వారా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వెల్లడైంది. కెనడాలోని ఒంటారియో నగరంలోని సెయింట్ మైఖేల్ ఆసుపత్రిలో జరిగిన ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన జాన్ సెన్ పైపర్ మాట్లాడుతూ, ఆహారంలో భాగంగా ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటివి తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.
Fri, Dec 22, 2017, 03:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View