వంట‌లకు గేమింగ్ యాప్‌... ఆవిష్క‌రించ‌నున్న శిల్పాశెట్టి
Advertisement
కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాకుండా ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా, గృహిణిగా పేరు సంపాదించుకున్న శిల్పా శెట్టి త్వ‌ర‌లో ఓ గేమింగ్ యాప్‌ను ఆవిష్క‌రించ‌బోతున్నారు. త‌క్కువ స‌మ‌యంలో వంట చేసి, వ‌డ్డించ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని ఈ గేమ్ ద్వారా ప‌రీక్షించ‌వ‌చ్చు. ఎంత త్వ‌ర‌గా వంట చేసి అందివ్వ‌గ‌లిగితే అన్ని పాయింట్ల‌ను ఈ గేమ్‌లో పొందే అవ‌కాశం ఉంటుంది. ఈ గేమ్‌లో ఆమెను పోలిన ఓ పాత్ర కూడా ఉండ‌నుంది. అయితే ఈ గేమ్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు.

ఇప్ప‌టికే యూట్యూబ్ ఛాన‌ల్, సోష‌ల్ మీడియా ద్వారా కొత్త కొత్త వంట‌ల‌ను శిల్పా శెట్టి అభిమానుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ గేమింగ్ యాప్ ద్వారా ఆమె వారికి మరింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.
Tue, Dec 19, 2017, 04:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View