సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

17-12-2017 Sun 07:43

*  జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు.. అంటోంది చెన్నయ్ బ్యూటీ త్రిష. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కథానాయికగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మాట్లాడుతూ, 'మనం ఎన్నో అనుకుంటూ వుంటాం. అయితే, అన్నీ నిజమవ్వవు. కొన్ని అవుతాయి, కొన్ని కావు. దానికి అప్సెట్ అవకూడదు, అంతా మన మంచికే జరిగిందిలే అనుకోవాలి" అంటూ వేదాంతం చెబుతోంది.    
*  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం నుంచి కెమెరా మేన్ రవి కె.వర్మన్ తప్పుకున్నాడు. దీంతో కొత్తగా తిరు జాయిన్ అయ్యాడు. గతంలో తిరు 'జనతా గ్యారేజ్' చిత్రానికి పనిచేశాడు. రవి ఈ ప్రాజక్టు నుంచి తప్పుకోవడానికి కారణాలు తెలియరాలేదు.      
*  నాగశౌర్య హీరోగా నటించిన 'చలో' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మండన కథానాయికగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.  
*  గతంలో వచ్చిన 'దండుపాళ్యం' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'దండుపాళ్యం 2' తీయగా, అది కూడా విజయం సాధించింది. దీంతో తాజాగా 'దండుపాళ్యం 3'ని కూడా నిర్మిస్తున్నారు. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


More Telugu News
Naveen Polishetty is teking high remunaration
CBI officials vists Viveka house in Pulivendula
CM Jagan wishes all Telugu people across the world happy Ugadi
Pawan wishes happy Ugadi to all the telugu people
Hero Siddarth shares a photo
Bahubali Producers Call to Regina
Corona scares looming over AP as study rise in new cases
Modi crossing limits says Mamata Banerjee
Ramnath Kovind returned to Rashtrapathi Bhavan after Bypass procedure
Raviteja Upcoming Movie with Sharath Mandava
Minister Balineni comments on Vakeel Saab movie issue
Dont dissolve the ambition of Jagan says Tammineni Sitaram
KTR gets angry on opposition leaders
Rain in Hyderabad
Maajor Teaser Released
..more