బ‌ట్ట‌త‌ల వ‌స్తోందా?... వెంట్రుక‌లు నెరుస్తున్నాయా?.... కొంచెం జాగ్ర‌త్త మ‌రి!
Advertisement
Advertisement
40 ఏళ్ల లోపే బ‌ట్ట‌త‌ల వ‌స్తోందా... తెల్ల వెంట్రుక‌లు వ‌స్తున్నాయా.. అయితే కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండండి. అలాంటి స‌మస్య‌లు ఎదుర్కుంటున్న వారు గుండె జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఊబకాయం ఉన్న వారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వీరికి ముప్పు ఉంటుందని రుజువైంది. అయితే బట్టతల, జుట్టు నెరవటం ఈ ల‌క్ష‌ణాల ఆధారంగా గుండె రక్తనాళాల్లో సమస్యలను తేలిగ్గా గుర్తించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

తల వెంట్రుకలు నెరిసిన వారిలో మిగతా వారితో పోలిస్తే 50 శాతం అధికంగా రక్తనాళాల్లో సమస్యలు ఎక్కువగా వ‌స్తాయ‌ని, అదే బట్టతల వచ్చిన వారిలో మిగతా వారితో పోలిస్తే 49 శాతం ఎక్కువగా హృద్రోగాలు తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు గుజరాత్‌లోని యూఎన్‌ మెహతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చి సెంటర్‌కు చెందిన సచిన్‌ పాటిల్‌. ఇటీవల కోల్‌కతాలో జరిగిన కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సదస్సులో ఈ అధ్యయన ఫలితాలను ప్రకటించారు.

40 ఏళ్ల లోపు ఉన్న‌ 790 మంది పురుషుల్లో గుండె రక్తనాళాల్లో సమస్యలను అధ్యయనం చేసి, ఈ ఫలితాలను 1,270 మంది ఆరోగ్య వంతులైన పురుషులతో పోల్చి చూసిన‌పుడు ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అయితే చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతున్న లేదా బట్టతల వస్తున్న వారికి ఎలాంటి ముందు జాగ్రత్తలు, చికిత్స అవసరమో నిర్ణయించటం మరింత సులువు కానుందని కార్డియాలజిస్ట్‌ ధమ్‌దీప్‌ హుమానే అన్నారు.
Thu, Nov 30, 2017, 05:59 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View