నాసాకు కూడా అంతుబట్టని ఆ శబ్దాలు ఏమై ఉంటాయబ్బా?
Advertisement
ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు కూడా అంతుబట్టని వింత శబ్దాలు ఆందోళనలోకి నెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 64 ప్రాంతాల్లో ఈ విచిత్ర ధ్వనులు రికార్డయ్యాయి. ఆస్ట్రేలియాతో బాటు అమెరికా తూర్పు తీరంలో ఈ సౌండ్స్ ను ఎక్కువ మంది వినడం విశేషం. అమెరికాలోని అలబామా స్టేట్ ప్రజలను ఈ శబ్దాలు అక్టోబర్ 10న బెంబేలెత్తించాయి. వీటిని వారు ‘బామా బూమ్‌’గా పిలుస్తున్నారు.

తొలుత ఆ శబ్దాన్ని అమెరికాకు చెందిన ఎఫ్‌ఏ-18 హార్నట్‌ విమానం హోరు అయివుంటుందని భావించారు. దానికి రెండు వారాల తర్వాత దక్షిణ ఆస్ట్రేలియాలోని ఐర్‌ ద్వీపకల్పంలో కూడా అచ్చం అలాంటి గర్జనే వినిపించి ఆందోళన రేపింది. అయితే అక్కడ ఆ శబ్దం వచ్చిన సమయంలో ఆకాశంలో నీలం రంగు ఉల్క కిందికి వస్తున్నట్టు కనిపించింది. దీంతో ఉల్కాపాతం శబ్దమని పలువురు భావించారు. ఈ శబ్దాలపై పుకార్లు షికార్లు చేస్తుండడంతో నాసా రంగంలోకి దిగింది. ఈ శబ్దానికి సంబంధించిన డేటా సేకరించే పనిలో నాసా సైంటిస్టులు ఉన్నారు. 
Sat, Nov 25, 2017, 10:44 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View