భార‌త్‌లో ప్రాచుర్యం పొందుతున్న మోటార్ ర్యాలీయింగ్‌.. చిక్‌మగళూర్‌లో జ‌రుగుతున్న పోటీలు!
Advertisement
మోటార్ రేసింగ్‌ల్లో ఫార్ములా వ‌న్ పోటీల త‌ర్వాత బాగా ప్రాచుర్యం ఉన్న ఆట మోటార్ ర్యాలీయింగ్‌. ఇప్పుడిప్పుడే భార‌త్‌లో ప్రాచుర్యం పొందుతున్న ఈ గేమ్‌కి సంబంధించిన పోటీలు ప్ర‌స్తుతం చిక్‌మగ‌ళూర్‌లో జ‌రుగుతున్నాయి. ఈ పోటీల్లో హైద‌రాబాద్‌కి చెందిన స్నాప్ రేసింగ్ జ‌ట్టు పాల్గొంటోంది. ఈ పోటీల కోసం మ‌లేషియాలో ప్ర‌త్యేకంగా త‌యారుచేసిన మిట్సుబుషీ లాన్స‌ర్ ఈవో కారును స్నాప్ రేసింగ్ బృంద స‌భ్యులు సుమిత్ పంజాబీ, నితిన్ జాకోబ్‌లు ఎంచుకున్నారు.

వివిధ కేట‌గిరీల్లో ఈ పోటీలు జ‌రుగుతున్నాయి. అందులో ఏపీఆర్‌సీ, ఐఎన్ఆర్‌సీ కేట‌గిరీల్లో స్నాప్ రేసింగ్ బృందం పోటీప‌డుతోంది. కాఫీ డే ఇండియా ర్యాలీ 2017 పేరుతో ఈ పోటీలు జ‌రుగుతున్నాయి. చిన్న‌ప్ప‌టి మోటార్ గేమింగ్ మీద ఆస‌క్తి ఉన్న సుమిత్ త‌న ల‌క్ష్య‌సాధ‌న‌లో భాగంగా ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ రేసింగ్, ర్యాలీయింగ్ పోటీల్లో పాల్గొన్నారు.
Wed, Nov 22, 2017, 12:19 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View