పని చేసింది 38 రోజులే.. అయినా అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం!
Advertisement
కేవలం 38 రోజులపాటు పని చేసిన హిటోమీ ఎక్స్‌ రే ఉపగ్రహం విశ్వాంతరాళంలోని అద్భుతమైన సమాచారం అందజేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలో శక్తిమంతమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జపాన్‌, నాసా కలసి హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహాన్ని తయారు చేశాయి. ఈ ఉపగ్రహం గత ఫిబ్రవరి 17 నుంచి మార్చి 26 వరకు పని చేసింది. నియంత్రణ వ్యవస్థలోపం కారణంగా ఇది పనిచేయడం మానేసింది.

అయితే పని చేసినన్ని రోజులు అద్భుతంగా పని చేసింది. భూమికి 240 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో సన్నని వేడి వాయువు లోపల తిరుగుతున్న వేలాది పాలపుంతల ‘పర్స్యూస్‌’ గుంపు గురించిన కీలక సమాచారం అందజేసింది. పర్స్యూస్‌ లోని వాయువు, అక్కడ జరిగే నక్షత్ర పేలుళ్ల గురించిన కీలక సమాచారం అందజేసిందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ పరిశోధకులు తెలిపారు. 
Sat, Nov 18, 2017, 09:01 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View