స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగిస్తే ఏకాగ్రతకు ప్ర‌మాదం.. మెదడు పనితీరుపై ప్రభావం
Advertisement
స్మార్ట్‌ఫోన్ ఉంటే అర‌చేతిలో ప్ర‌పంచం ఉన్న‌ట్లేన‌ని భావిస్తాం. ఆధునిక మాన‌వుడి జీవితానికి, స్మార్ట్‌ఫోన్‌కి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు. సోష‌ల్ మీడియా, ఆన్‌లైన్ వ‌స్తువుల కొనుగోలు ఇలా అన్నింటికీ స్మార్ట్‌ఫోన్‌నే ఉప‌యోగిస్తున్నాం. అతి ఏదైనా ప్ర‌మాద‌మే.. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉప‌యోగించే వారిలో ఏకాగ్రత దెబ్బతింటుందని, మెదడు పనితీరును సెల్‌ఫోన్‌ ప్రభావితం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు చెబుతున్నారు.

తాము వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపామ‌ని, ఇందులో 800 మంది మొబైల్‌ఫోన్ ఉప‌యోగించేవారిని ఎంపిక చేశామ‌ని చెప్పారు. వాలంటీర్ల పనితీరును, మొబైల్‌ అందుబాటులో ఉన్నపుడు పనిలో, ఏకాగ్రతలో కలిగే మార్పులను పరిశీలించామ‌ని తెలిపారు. దీంతో ఈ విష‌యం తేలింద‌ని అంటున్నారు.  
Fri, Nov 17, 2017, 01:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View