అదుపుతప్పిన చైనా స్పేస్ స్టేషన్... ఆ మూడు మహానగరాలకు ముప్పు!
Advertisement
అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ అదుపుతప్పింది. దీని వల్ల మూడు మహానగరాలకు పెనుముప్పు పొంచి ఉందని యూరోపియన్‌ స్పేస్‌ స్టేషన్‌ హెచ్చరికలు జారీ చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... గతంలో అంతరిక్షంలో చైనా ప్రవేశపెట్టిన స్పేస్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది. దీని బరువు 8.5 టన్నులని తెలిపింది. ప్రస్తుతం దీని లొకేషన్ ఎక్కడుంది? ఎప్పుడు? ఎక్కడ కూలుతుంది? అన్న వివరాలు చెప్పలేమని చైనా శాస్త్రవేత్తలు చేతులెత్తేశారు.

అంతే కాకుండా ఈ స్పేస్ స్టేషన్ అమెరికాలోని న్యూయార్క్‌, చైనాలోని బీజింగ్‌, జపాన్‌ లోని టోక్యో నగరాల్లో కూలే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ మూడు మహానగరాలే కాకుండా లాస్‌ ఏంజెలిస్‌, ఇస్తాంబుల్‌, రోమ్‌ లకు కూడా ప్రమాదం పొంచివుందని, ఆ నగరాలు కాకపోతే ఈ నగరాలపై కూలే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కచ్చితంగా ఎక్కడ కూలుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ... సదరు స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలో ప్రవేశించడానికి రెండు గంటల ముందు మాత్రం చెప్పగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దానిపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 
Sat, Nov 11, 2017, 07:35 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View