చంద్రబాబును కలసిన వల్లభనేని వంశీ
02-11-2017 Thu 12:58
- సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ
- డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయకుండా చూడాలని విన్నపం
- ఫ్యాక్టరీ మూతపడితే రైతులు ఇబ్బందులు పడతారన్న వంశీ

ముఖ్యమంత్రి చంద్రబాబును టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఈ ఉదయం డెల్టా షుగర్ ఫ్యాక్టరీ రైతులతో కలసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే, రైతులను క్యాంపు కార్యాలయం లోనికి అనుమతించలేదు. దీంతో, వంశీ మాత్రమే చంద్రబాబును కలసి మాట్లాడారు.
డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేస్తే చెరకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని... చెరకును హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరుకు తరలించాల్సి ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు. ఈ కారణం వల్ల 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని... దీంతో, రవాణా ఖర్చులు అధికమవుతాయని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని, ఫ్యాక్టరీని మూసివేయకుండా చూడాలని సీఎంకు విన్నవించారు.
More Latest News
ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
20 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
41 minutes ago

నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
45 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
2 hours ago
