అంత‌ర్జాతీయ‌ అంత‌రిక్ష కేంద్రంలో హాలోవీన్ పండ‌గ‌!
Advertisement
Advertisement
హాలోవీన్ పండ‌గ‌ను అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్ర వ్యోమ‌గాములు చాలా ఆడంబ‌రంగా జ‌రుపుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో వారు పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే తెలుస్తుంది. విచిత్ర వేష‌ధార‌ణ‌ల్లో ఆరుగురు వ్యోమ‌గాములు ఉన్న ఫొటోను ఐఎస్ఎస్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 'హ్యాపీ హాలోవీన్‌! ఇవాళ అంత‌రిక్ష కేంద్రంలో ఒక మినియ‌న్‌, సైనికుడు, వొల్వ‌రిన్‌, స్పైడ‌ర్‌మ్యాన్‌, జాక్ ఓ లాంట‌ర్న్‌, ఇంకా ఒక ఎగురుతున్న కోతి ఉన్నాయి' అనే క్యాప్ష‌న్‌తో ఈ ఫొటోను పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలో ముగ్గురు అమెరిక‌న్ వ్యోమ‌గాములు, ఇద్ద‌రు ర‌ష్య‌న్ వ్యోమగాములు, ఒక ఇటాలియ‌న్ వ్యోమ‌గామి ఉన్నారు. వొల్వ‌రిన్ వేష‌ధార‌ణ‌లో ఉన్నది నాసా వ్యోమ‌గామి మార్క్ టి వాందే హై, జాక్ ఓ లాంట‌ర్న్ టీ ష‌ర్ట్ వేసుకున్న‌ది నాసా వ్యోమ‌గామి జోసెఫ్ ఎం. అకాబా, మినియ‌న్ టీ ష‌ర్ట్ వేసుకున్న‌ది నాసా వ్యోమ‌గామి రాండీ బ్రెస్నిక్‌గా తెలుస్తోంది. అలాగే కోతి వేషంలో ర‌ష్య‌న్ వ్యోమగామి సెర్జీ ర‌జిన్‌స్కి, స్పైడ‌ర్ మ్యాన్ లాగ ఇటాలియ‌న్ వ్యోమ‌గామి పావులో ఉన్నారు.
Wed, Nov 01, 2017, 04:28 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View