నాసా 2020లో ప్రయోగించే మార్స్ రోవ‌ర్‌కి 23 కెమెరాలు ఉంటాయట!
Advertisement
Advertisement
2020లో అంగార‌క గ్ర‌హం మీద‌కి పంపించనున్న రోవ‌ర్‌లో 23 కెమెరాలు అమ‌ర్చ‌నున్న‌ట్లు అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా వెల్ల‌డించింది. ఈ కెమెరాల సాయంతో అత్యంత స్ప‌ష్ట‌మైన పానొరామిక్ చిత్రాలు, రోవ‌ర్ దారిలో ఎదురయ్యే అడ్డంకుల చిత్రాలతో పాటు అంగార‌క గ్ర‌హ వాతావ‌ర‌ణాన్ని క్షుణ్ణంగా అధ్య‌యనం చేసే అవ‌కాశం క‌లగ‌నుంద‌ని నాసా చెబుతోంది. గ్ర‌హం మీద రోవర్ అడుగు పెట్టిన మరుక్షణం నుంచి ఈ 23 కెమెరాలు ప‌నిచేయ‌డం ప్రారంభిస్తాయ‌ని తెలిపింది. రోవ‌ర్ అంత‌ర్భాగంలో కూడా ఒక కెమెరా ఉంటుంద‌ని, అక్క‌డ రోవ‌ర్ సేక‌రించిన శాంపిళ్ల‌ను ప‌రిశోధించ‌డానికి ఈ కెమెరా స‌హాయ ప‌డుతుందని చెప్పింది.

క్యూరియాసిటీ రోవ‌ర్ కంటే మెరుగైన 3డీ ఇమేజింగ్ కెమెరాల‌ను ఇందులో నిక్షిప్తం చేస్తున్న‌ట్లు మాస్ట‌ర్‌క్యామ్ జీ ప్ర‌ధాన విశ్లేష‌కుడు జిమ్ బెల్ తెలిపాడు. రోవ‌ర్ ప్ర‌ధాన భాగాల్లో ఈ మాస్ట‌ర్‌క్యామ్ జీ కెమెరాల‌ను ఉప‌యోగించనున్నారు. ఈ స్టీరియోస్కోపిక్ కెమెరాల ద్వారా 3డీ చిత్రాలు తీయ‌డంతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న శాంపిళ్ల‌ను కూడా గుర్తించే అవ‌కాశ‌ముంద‌ని జిమ్ పేర్కొన్నాడు. అంతేకాకుండా గ్ర‌హం మీద ఉన్న జియోలాజిక‌ల్ ప‌రిస్థితుల‌ను కూడా భూమ్మీద నుంచే అధ్య‌య‌నం చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు.
Wed, Nov 01, 2017, 12:39 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View