నడుం చుట్టుకొలత పెరగడానికి కారణమిదే... నోట్లోనే శత్రువు వుంది!
Advertisement
చాలా మందికి జిహ్వ చాపల్యం ఉంటుంది. జంక్ ఫుడ్స్ తినడడం ఎంత వద్దనుకున్నా కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా అతిగా, అదేపనిగా తినడానికి కారణాన్ని డికిన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. అన్నం, స్వీట్లు, పాస్తా వంటి వాటిని ఎక్కువ ఆరగించడానికి ‘పిండి పదార్థం రుచి’ కారణమని అన్నారు. అయితే కారణం ఇదే అయినప్పటికీ, దీనిని గుర్తించే రుచి బొడిపెలు ప్రధాన కారకులని తేల్చారు.

ఈ పిండి పదార్థపు రుచికి నాలుకపై ఉండే రుచి బొడిపెలు బానిసలుగా మారుతున్నాయని, అలా మారడం వల్లే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని పరిశోధకులు తెలిపారు. వీటిని అతిగా తినడం వల్ల శరరీంలోని నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని వారు వెల్లడించారు. ఈ పిండి పదార్థం రుచి ఉప్పు, తీపి, పులుపు, చేదు, వగరు, కారం కంటే భిన్నమైనదని, అదే అధిక క్యాలరీలు ఉండే ఆహారం పట్ల కోరికను పెంచుతుందని వారు వెల్లడించారు. జిహ్వ చాపల్యాన్ని తగ్గించుకుంటే అధిక బరువు, స్థూలకాయ సమస్యలకు చెక్ చెప్పవచ్చని వారు తెలిపారు. 
Sat, Oct 28, 2017, 08:26 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View