పుస్త‌కాల మీద కూర్చుని ఫొటోల‌కు పోజులిచ్చిన ట్వింకిల్ ఖ‌న్నా.. నెటిజన్ల విమర్శలు!
Advertisement
ట్వింకిల్ ఖన్నా... న‌టిగా, ర‌చ‌యిత‌గా, అక్ష‌య్ కుమార్ భార్య‌గా, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ సెల‌బ్రిటీ. ఆమె ఇటీవ‌ల వోగ్ ఇండియా మేగ‌జైన్ కోసం ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఆ షూట్‌కి సంబంధించిన ఫొటోను త‌న‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. పుస్త‌కాల మీద కూర్చుని ట్వింకిల్ దిగిన ఆ ఫొటోను నెటిజ‌న్లు త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. త‌న కాలి కింద ఉన్న‌వి కూడా పుస్త‌కాలే అనుకుని ఆమెపై మండిప‌డుతూ కామెంట్లు పెట్టారు. `పుస్త‌కాల‌ను ఎవ‌రైనా తొక్కుతారా?`, `ర‌చ‌యిత అయ్యుండి పుస్త‌కాల‌ను ఇలా కించ‌ప‌రుస్తావా? రేపు నీ పుస్త‌కాలను కూడా ఇలాగే చేస్తే ఏం చేస్తావ్?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

దీనిపై స్పందించిన ట్వింకిల్... తాను పుస్త‌కాల‌పై కూర్చోలేద‌ని, స్టూల్ మీద కాలు పెట్టాన‌ని, సరిగా చూడ‌మ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చింది. అయితే నెటిజ‌న్లు వెంటనే మాట మార్చి.... `పుస్త‌కాల మీద కూర్చోవ‌డం కూడా త‌ప్పే` అంటూ కామెంట్లు చేశారు. దానికి ఆమె.. `నాకు పుస్త‌కాల మీద కూర్చోవ‌డానికి ఎలాంటి సంకోచం లేదు. అంతేకాదు... వాటి ప‌క్క‌నే ప‌డుకుంటా.. వీలైతే బాత్రూమ్‌కి కూడా తీసుకెళ్తా... పుస్త‌కాల‌ను చ‌దివిన‌పుడే నీకు జ్ఞానం వ‌స్తుంది, వాటిని గౌర‌వించిన‌పుడు కాదు` అని గ‌ట్టిగా స‌మాధానం చెప్పి త‌న ర‌చ‌నా చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఆమె ఇప్ప‌టికే `మిసెస్ ఫ‌న్నీ బోన్స్‌`, `ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్ర‌సాద్‌` పేరుతో రెండు పుస్త‌కాల‌ను ర‌చించిన సంగ‌తి తెలిసిందే.

Sometimes I get to do this as well- like the Madonna song 'Strike a pose -Vogue, Vogue Vogue!' @vogueindia P.S For the easily outraged : My foot is on a stool and not a book because I don't want to get dust on the cover- aside from that I have no qualms with sitting on books, sleeping next to them or even keeping a pile in the bathroom to read regularly-The God of Wisdom visits you when you read books not worship them - Love and laughter from this bookworm

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

Wed, Oct 25, 2017, 01:08 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View