అందాల 'బామ్మ‌'లు... అట్లాంటిక్ సిటీలో జ‌రిగిన 'మిస్ సీనియ‌ర్ అమెరికా' పోటీలు!
Advertisement
సాధార‌ణంగా అందాల పోటీలు అన‌గానే అంద‌మైన అమ్మాయిలు, ర్యాంప్‌ల‌పై వ‌య్యారాలు గుర్తొస్తాయి. కానీ అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో జ‌రిగిన అందాల పోటీల్లో ఇవేమీ క‌నిపించ‌వు. అక్క‌డ వ‌య‌సు మీద ప‌డిన బామ్మ‌లు కనిపిస్తారు. అవును... మిస్ సీనియ‌ర్ అమెరికా పేరుతో ఈ పోటీలు ఎప్ప‌ట్నుంచో జ‌రుగుతున్నాయి.

ఈ పోటీల్లో 60 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌లు పాల్గొంటారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన బామ్మ‌లు పాల్గొన్న ఈ పోటీలో 73 ఏళ్ల‌ మిస్ న్యూజెర్సీ క‌రోలిన్ స్లేడ్ హార్డెన్ విజేత‌గా నిలిచింది. అన్ని అందాల పోటీల్లాగానే ఇందులో కూడా వివిధ రౌండ్లు ఉంటాయి. అన్ని రౌండ్ల‌లోనూ బామ్మ‌లు పాట‌లు పాడి, స్టెప్పులు వేసి అల‌రించారు. వీరిలో 90 ఏళ్ల‌కు పైబ‌డిన బామ్మ‌లు కూడా వుండడం విశేషం! 
Fri, Oct 20, 2017, 05:17 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View