టైప్2 మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచే పిల్స్‌... రూపొందించిన యూకే శాస్త్ర‌వేత్త‌లు
Advertisement
ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ధుమేహ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వీరిలో ముఖ్యంగా టైప్ 2 బాధితులు ఎక్కువగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దీన్ని నియంత్ర‌ణ‌లో ఉంచ‌డానికి చాలా మంది ప‌రిశోధ‌న చేశారు. చాలా ర‌కాల చికిత్స‌లు అందుబాటులో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీనికి కార‌ణం స‌రైన చికిత్స ఎంచుకోక‌పోవ‌డ‌మ‌ని యూకే శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అంతేకాకుండా టైప్ 2 మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచే మందుల‌ను కూడా వీరు అభివృద్ధి చేశారు. ఈ మందులు బ‌రువును త‌గ్గించ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వారు అంటున్నారు.

వ్యాధిగ్ర‌స్థులు సామర్థ్యానికి మించి మందులు తీసుకోవ‌డం వ‌ల్ల హైపోగ్లైసీమియా (శరీరంలో చక్కెర శాతం తక్కువగా ఉండే స్థితి) వచ్చి, చికిత్సను సంక్లిష్టంగా మారుస్తుంద‌ని లీసెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మెలానియే డేవీస్ పేర్కొన్నారు. ఆమె త‌న‌ సహోద్యోగులతో కలిసి చేసిన ప్ర‌యోగంలో 632 మంది టైప్‌2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థులకు ప్లేసిబో, సెమాగ్లుటైడ్‌ మందులను వేరు వేరుగా వివిధ మోతాదుల్లో 26 వారాలపాటు ఇచ్చారు.

ప్లేసిబో తీసుకున్న వారికంటే సెమాగ్లుటైట్‌ మందు తీసుకున్న వారిలో 5 శాతానికిపైగా బరువు తగ్గడాన్ని గమనించారు. దాదాపు 71 శాతం బాధితులకు సెమాగ్లుటైడ్‌ ఉపశమనం కలిగించిన‌ట్టు ప‌రిశోధ‌నా వ్యాసంలో తెలియ‌జేశారు. 
Fri, Oct 20, 2017, 01:29 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View