ఆల్కహాల్‌తో విదేశీ భాషా నైపుణ్యాలు పెరుగుతాయంటున్న శాస్త్ర‌వేత్త‌లు!
Advertisement
త‌క్కువ మొత్తంలో ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వ‌ల్ల విదేశీ భాషా నైపుణ్యాలు మెరుగుప‌డ‌తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. త‌క్కువ మొత్తంలో తీసుకుంటే మాత్ర‌మే ఈ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని, ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ప్ర‌మాద‌మ‌ని వారు నొక్కివ‌క్కాణిస్తున్నారు. డ‌చ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న 50 మంది జ‌ర్మ‌న్ విద్యార్థుల‌పై లివ‌ర్‌పూల్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేసి ఈ విషయాన్ని క‌నిపెట్టారు. ఇప్పుడిప్పుడే డ‌చ్ భాష నేర్చుకుంటున్న జ‌ర్మ‌న్ విద్యార్థుల్లో కొంత‌మందికి త‌క్కువ మోతాదులో ఆల్క‌హాల్ ఉన్న డ్రింక్ ఇచ్చి, మ‌రి కొంత‌మందికి ఆల్క‌హాల్ లేని డ్రింక్‌ను ఇచ్చారు. త‌ర్వాత వారిని ఇంట‌ర్వ్యూ చేశారు.

ఈ ఇంట‌ర్వ్యూలో ఆల్క‌హాల్ తీసుకున్న వారు డ‌చ్ భాషను స్ప‌ష్టంగా ప‌లికిన‌ట్లు, మాట్లాడేట‌పుడు కూడా ఏ మాత్రం త‌డ‌బ‌డ‌లేద‌ని పరిశోధకులు వెల్ల‌డించారు. ఆల్క‌హాల్ తీసుకున్న‌పుడు ఆత్మ‌స్థైర్యం పెర‌గ‌డం వ‌ల్ల వాళ్లు కొత్త‌గా నేర్చుకున్న భాష‌ను స్ప‌ష్టంగా మాట్లాడ‌గ‌లిగార‌ని, ఆల్క‌హాల్ తీసుకోని వారు త‌డ‌బ‌డ్డార‌ని వారు పేర్కొన్నారు.
Thu, Oct 19, 2017, 03:28 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View