దుష్ప్రభావాలు లేని బాధా నివారిణిగా పాము విషం!
Advertisement
పెయిన్ కిల్లర్ గా అరుదైన పాము విషం విశేషంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నొప్పిని నివారించడంలో కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్‌ గా పిలుచుకునే అరుదైన నీలిపగడపు పాము విషం అద్భుతంగా పని చేస్తుందని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వారు వెల్లడించారు. నీలిపగడపు పాము విషంపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త బ్రాన్ ఫై ఆధ్వర్యంలో పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. ఈ పాము విషం బాధానివారిణిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.

 ఈ పాముకున్న విషగ్రంథులు వాటి శరీరంలో 60 సెంటీ మీటర్ల వరకు విస్తరించి ఉంటాయని, ఈ లెక్కన పాము పొడవులో ఒక వంతు వరకు ఈ విషగ్రంధులు ఉంటాయని అన్నారు. ఈ పాము విషంలో సోడియం పాళ్లు కూడా ఎక్కువని వెల్లడించారు. దీనితో నొప్పిని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారించవచ్చని అన్నారు. అయితే ఈ పాముల సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీని విషంతో ఔషధాన్ని తయారు చేసేందుకు సరిపడా పాములను సేకరించగలిగితే నొప్పి నివారణకు సరైన ఔషదం తయారు చేయవచ్చని ఆయన చెప్పారు. 
Thu, Oct 19, 2017, 08:03 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View